తెలంగాణ

telangana

కాళేశ్వరం గాయత్రి పంప్‌ హౌస్‌ - 200 టీఎంసీలకు చేరుకున్న గోదావరి జలాల ఎత్తిపోత - GAYATHRI LIFT REACH 200 TMC WATER

By ETV Bharat Telangana Team

Published : Aug 27, 2024, 12:03 PM IST

Gayathri Pupmhouse (ETV Bharat)

Gayatri Pump House Record  : కాళేశ్వరం ప్రాజెక్టు ఎనిమిదో ప్యాకేజీ అయిన గాయత్రి పంప్ హౌస్ ప్రారంభించిన నాటి నుంచి గోదావరినది జలాల ఎత్తిపోతలు 200 టీఎంసీలకు చేరుకుంది. కరీంనగర్ జిల్లా, రామడుగు మండలం, లక్ష్మీపూర్ గ్రామంలో 2019 ఆగష్టు 11న తొలిసారిగా గాయత్రి పంప్ హౌస్ నుంచి జలాల ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. లక్ష్మీపూర్ లోని 0.1టీఎంసీల సర్జ్ పూల్ నుంచి 115 ఎత్తులోని ఉపరితలంపైకి  గోదావరి జలాల తరలించే ప్రక్రియ చేపట్టారు. దీని కోసం 139 మెగావాట్ల సామర్థ్యం గల ఏడు బాహుబలి పంపులు ఉపయోగిస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులోనే అతి పెద్ద పంపుసెట్లు కలిగిన గాయత్రి పంప్ హౌస్ నుంచే ఉపరితల నీటి తరలింపు మొదలై ఎస్సారెస్పీ వరదకాలువ, మధ్యమానేరు జలాశయం, ఎగువ ప్రాంతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకానికి జలాలు వెళ్తున్నాయి. ఒక్కో బాహుబలి పంపుసెట్ 3150 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుండగా, ప్రారంభించిన నాటి నుంచి పంప్ హౌస్ సమర్థంగా పనిచేస్తోంది. మేడిగడ్డ వద్ద నుంచి ఎత్తిపోతలు నిలిచిపోగా గత జులై నెల 27 నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు చేపట్టారు. మెట్ట ప్రాంతాలకు సాగు నీరు అందించే క్రమంలో రోజుకు 2 టీఎంసీల జలాల ఎత్తిపోతలు చేపట్ట గలిగే గాయత్రి పంప్ హౌస్ కాళేశ్వరం ప్రాజెక్టులోనే కీలకంగా వ్యవహరిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details