తెలంగాణ

telangana

ETV Bharat / videos

హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్‌ హల్‌చల్‌ - వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి - Ganja batch hulchul in hyderabad - GANJA BATCH HULCHUL IN HYDERABAD

By ETV Bharat Telangana Team

Published : Jun 14, 2024, 7:47 PM IST

Ganja Gang Active in Kothapet in Hyderabad : హైదరాబాద్‌ నగరంలోని కొత్తపేటలో అర్ధరాత్రి గంజాయి గ్యాంగ్‌ వీరంగం సృష్టించింది. అర్ధరాత్రి వరకు రోడ్లపై బైఠాయించి పోకిరీలు బ్యాచ్‌లుగా గంజాయి తాగుతున్నారు. దీంతో కొత్తపేటలోని ఓ కాలనీలో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తమ ఇంటి ముందు గంజాయి బ్యాచ్‌ ఉంటే అక్కడి నుంచి వెళ్లాలని ఇంటి యజమాని జనార్ధన్‌ నాయుడు చెప్పాడు. 

మమ్మల్నే వెళ్లమంటావా అంటూ ఇంటి యజమానిపై ఒక్కసారిగా గంజాయి బ్యాచ్‌ కర్రలతోనూ, రాళ్లతోనూ విచక్షణ రహితంగా దాడి చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారీ అయ్యారు. గంజాయి బ్యాచ్‌ దాడిలో జనార్ధన్‌ నాయుడు తీవ్రంగా గాయపడ్డారు. అతనిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అతనిపై జరిగిన దాడిని స్థానికులు సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. ప్రతిరోజు ఇలానే బయటనుంచి వచ్చి గంజాయి బ్యాచ్‌ న్యూసెన్స్‌ చేస్తారని స్థానికులు వాపోయారు. తనపై దాడికి సంబంధించి సరూర్‌నగర్‌ పోలీసులకు జనార్ధన్‌ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో గంజాయి బ్యాచ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details