ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

గత ప్రభుత్వ నిర్వాకంతోనే యాష్‌పాండ్‌కు గండి- రైతులను ఆదుకుంటాం: మంత్రి గొట్టిపాటి - Gandi to Thermal Plant Ash Pond - GANDI TO THERMAL PLANT ASH POND

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 4, 2024, 5:57 PM IST

Gandi to Damodaram Sanjeevaiah Thermal Power Plant Ash Pond: గత ప్రభత్వం నిర్లక్ష్యం వల్లే నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ స్టేషన్​కి చెందిన యాష్ పాండ్ కట్టకు గండి పడిందని స్థానిక రైతులు ఆరోపించారు. బూడిద చెరువు పడమటి కట్టకు గండిపడటంతో సమీప గ్రామాల పొలాల్లో ఉప్పు నీరు, బూడిద చేరిందన్నారు. ఘటనాస్థలాన్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. నాణ్యత లేని నిర్మాణాల వల్లే ప్రమాదం సంభవించిందని సోమిరెడ్డి అన్నారు. 

గండిపడిన ఏపీ జెన్​కో యాష్ పాండ్ పునరుద్ధణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామని ఇంధన శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. బాధిత రైతులను ఆదుకుంటామని భరోసానిచ్చారు. బూడిద చెరువు తెగిపోవడంతో ఆముదాలపాడు, మిట్టపాలెం, ముసునూరివానిపాలెం తదితర సమీప గ్రామాల్లోని పొలాల్లోకి బూడిద నీరు వచ్చిందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు తెగిపోవడానికి గల కారణాలపై సమగ్ర వివరణ అందజేయాలని అధికారులకు ఆదేశించారు. ఇంధన శాఖ అధికారులు గండిని పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని, ఆ ప్రాంత ప్రజలు, రైతుల్లో నెలకొన్న భయాలను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details