వంతెన లేక-వాగు దాటే దారి లేక - నిత్యం సాహసం - People Problems due to No Bridge - PEOPLE PROBLEMS DUE TO NO BRIDGE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 9, 2024, 12:12 PM IST
Four Villages People Facing Problems due to No Bridge: అనకాపల్లి జిల్లా చోడవరం మండలం పెద్దేరు వాగు చుట్టుపక్కల నాలుగు గ్రామాల ప్రజల జీవనాధారానికి అడ్డంకిగా మారింది. వాగుకు ఓ వైపు నివాసాలు, మరోవైపు పొలాలు, పశువులు పాకలు ఉండటంతో చీటికీ మాటికీ స్థానికులు వాగుని దాటాల్సి వస్తుంది. అయితే వాగు దాటేందుకు ఎలాంటి వంతెన లేకపోవటంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొంతమంది తాడు సాయంతో, మరికొంత మంది ఓ చిన్న బోటు ఎక్కి వాగు దాటుతున్నారు.
పొట్టకూటి కోసం ప్రమాదకర రీతిలో వాగును దాటాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యపై ఎన్నిసార్లు అధికారలకు విన్నవించినా ఫలితం లేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు వీలైనంత త్వరగా వంతెన నిర్మించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాకపోకలకు ఎన్నో ఎళ్లుగా ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని ఆవేదన చెందుతున్న స్థానికులతో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి.