ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పక్కా సమాచారంతో భారీగా గంజాయి పట్టివేత - నలుగురు అరెస్ట్ - Police Seized Ganja - POLICE SEIZED GANJA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 11, 2024, 7:31 PM IST

Four Persons Arrested for Transporting Ganja: అనకాపల్లి జిల్లా నెల్లిమెట్ట వద్ద గంజాయి రవాణా చేస్తున్న నలుగురుని నర్సీపట్నం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 267 కేజీల గంజాయిని స్వాధీనం (Police seized 267 kg of ganja) చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో నెల్లిమెట్ట వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. చింతపల్లి నుంచి తునికి ఆటోలో గంజాయిని తరలిస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు.

Police Seized Ganja At Visakhapatnam: గడిచిన రోజు విశాఖ జిల్లా అగనంపూడి టోల్‌గేట్‌ వద్ద పోలీసుల తనిఖీల్లో 14 కేజీల గంజాయి పట్టుబడింది. నర్సీపట్నం - విశాఖ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఉన్న గంజాయిని పోలీసులు గుర్తించారు. 14 కేజీల చొప్పున రెండు బస్తాల గంజాయి తరలిస్తున్న దంపతులను దువ్వాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details