పాలకులు ఉచితంగా విద్య, వైద్యం అందిస్తే సరిపోతుంది : వెంకయ్యనాయుడు - Venkaiah Naidu on Free Schemes - VENKAIAH NAIDU ON FREE SCHEMES
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 11, 2024, 2:11 PM IST
Venkaiah Naidu on Free Schemes : కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులో స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ప్రజలకు వైద్యం, చదువు ఉచితంగా అందిస్తే సరిపోతుందని వెంకయ్యనాయుడు అన్నారు. మిగతావి ఫ్రీగా ఇవ్వకపోయిన పర్వాలేదని చెప్పారు. తద్వారా దేశం, రాష్ట్రాలు బాగుపడుతాయని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. పథకాలు ఉచితంగా ఇచ్చే బదులు ప్రజలకు పనిలో శిక్షణ ఇవ్వాలని వివరించారు. ఫలితంగా వారు ఉపాధి పొందుతారని వెంకయ్యనాయుడు వెల్లడించారు.
Venkaiah Naidu on Free Health Camps : ఉచిత వైద్య శిబిరాల వల్ల చుట్టుపక్కల గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రయోజనకరమని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వైద్య శిబిరాల్లో సకాలంలో తగిన చికిత్స అందడంతో పాటు స్క్రీనింగ్ పరీక్షల వల్ల చాలా రుగ్మతలకు ముందుగానే నివారణ సాధ్యమవుతుందని వివరించారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన గుడివాడ ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వారికి వెంక్యయనాయుడు ధన్యవాదాలు తెలిపారు.