ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తెలుగుదేశానికి వెన్నెముక బీసీలు- బీసీలపై కక్షగట్టిన జగన్ సర్కారు: పరిటాల సునీత - Sunitha Inaugurated Jayaho BC Sabha

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 12, 2024, 7:23 PM IST

Former TDP Minister Paritala Sunitha Inaugurated the Jayaho BC Sabha in Satya Sai District : రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్, ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డిని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత వ్యాఖ్యానించారు. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లిలో జయహో బీసీ సభలో పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీని జెండా ఊపి ఆమె ప్రారంభించారు.

సిద్ధం హోర్డింగుల కోసం ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయడానికి జీవోను తీసుకురావడంపై సునీత మండిపడ్డారు. నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అంటూ జగన్ వారిని వెన్నుపోటు పొడిచాడని దుయ్యబట్టారు. వైసీపీని ఎదిరించినందుకు 3 వేల మంది బీసీలపై దాడులు, దౌర్జ్యన్యాలు జరిగాయన్నారు. మానసికంగా దెబ్బతీయడానికి వారిపై 26వేల అక్రమ కేసులు పెట్టారని సునీత విమర్శించారు. దొంగ ఓట్ల నమోదు చేయడానికి సహకరించిన అధికారులు సస్పెండ్ అయ్యారని పేర్కొన్నారు. వైసీపీకి తొత్తులుగా మారినందుకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జైలుకు వెళ్లారన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details