ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కృష్ణపట్నం పోర్టు తరలిపోకుండా న్యాయ పోరాటం: సోమిరెడ్డి - మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్

🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 24, 2024, 6:13 PM IST

Former Minister Somireddy Chandhra Mohan Reddy : నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టర్మినల్ తరలిపోకుండా న్యాయ పోరాటం చేస్తామని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా టెర్మినల్ తరలింపునకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని సోమిరెడ్డి కోరారు. పోర్ట్ కంటైనర్ టర్మినల్ వల్ల రాష్ట్ర ఆదాయం కోల్పోవడంతో పాటు, ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని సోమిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

Somireddy Chandhra Mohan Reddy on Krishna Patnam Port : పరిశ్రమలు తరలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఆయన మండిపడ్డారు. సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీలు టీడీపీ నేతలతో కలిసి పోరాటానికి రావాలని సోమిరెడ్డి పిలుపునిచ్చారు. అన్ని పార్టీలతో కలిసి కంటైనర్ టర్మినల్ కాపాడుకుంటామని ప్రకటించారు. కంటైనర్ టర్మినల్ విషయంలో ప్రభుత్వ వైఖరి సరైనది కాదని సోమిరెడ్డి అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details