LIVE : మీడియాతో మాట్లాడుతున్న మాజీమంత్రి హరీశ్‌రావు - Harish Rao Live - HARISH RAO LIVE
Published : Sep 13, 2024, 3:05 PM IST
|Updated : Sep 13, 2024, 3:22 PM IST
Harish Rao Live : పార్టీ ఫిరాయింపులుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ పరస్పర సవాళ్లతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన పోలీసుల తోపులాటలో మాజీమంత్రి హారీశ్‌రావు గాయపడ్డారు. ముందస్తు జాగ్రత్తగా ఇవాళ హరీశ్‌రావు ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. హరీశ్‌రావు భుజానికి గాయం దృష్ట్యా పరామర్శించడానికి వచ్చిన సునీత, మాలోతు కవితను అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపటి వరకు వాగ్వాదం చోటుచేసుకుని వారిని అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. హరీశ్‌రావు ఆస్పత్రికి వెళ్తానంటే మొదట అనుమతించని పోలీసులు, తర్వాత ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ నాయకులపై జరిగిన దాడుల గురించి, ఇవాళ ఆ పార్టీ నేతల అరెస్టుల గురించి మాజీమంత్రి హరీశ్‌రావు మాట్లాడుతున్నారు. దాడికి పాల్పడిన అరెకపూడి, అనుచరులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దాడి కారకులను అరెస్టు చేయాలని, అరెస్టు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Last Updated : Sep 13, 2024, 3:22 PM IST