'కారును ఢీకొన్నది పెద్దపులేనని చెప్పలేెం'- ఘటనపై ముమ్మరంగా కొనసాగుతున్న దర్యాప్తు - Authorities Search Car Hit by Tiger - AUTHORITIES SEARCH CAR HIT BY TIGER
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 18, 2024, 9:27 PM IST
Forest Department Authorities Investigate the Car Hit by Tiger: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో కారును ఓ పెద్దపులి ఢీకొన్న ఘటనపై అటవీశాఖ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. జంతువు ఆచూకీ కోసం డ్రోన్‌తో అడవిని జల్లెడ పడుతున్నారు. 2-3 కిలోమీటర్ల పరిధిలో గాలించినా పులి ఆచూకీ దొరకలేదని అటవీశాఖ అధికారులు తెలిపారు. సోమవారం మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న ఓ జంతువును బద్వేలు నుంచి వెళ్తున్న కారు వేగంగా ఢీకొంది. ఆ వేగంలో పులిని 50 మీటర్లు కారు ఈడ్చుకెళ్లింది.
ఈ ఘటనలో కారు ముందు భాగం దెబ్బతింది. అందులో ప్రయాణిస్తున్న వారు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. కారును ఢీకొన్నది పెద్దపులేనని అది తీవ్ర గాయాలతో అడవిలోకి వెళ్లిందని డ్రైవర్ చెప్పారు. కానీ అది పులేనని కచ్చితంగా చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో అలాంటి ఆనవాళ్లు కనిపించలేదని అధికారులు తెలిపారు. కొన్ని ఆధారాలు సేకరించి ల్యాబ్‌కు పంపామన్నారు. ఫలితాలు వచ్చాక ఓ నిర్ధారణకు వస్తామన్నారు. సంఘటన స్థలానికి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.