ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విశాఖ రైల్వేస్టేషన్‌లో కుంగిన ఫుట్ ఓవర్ వంతెన - యుద్ధప్రాతిపదికన మరమ్మతులు - Visakha FOB sagging - VISAKHA FOB SAGGING

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 8, 2024, 1:44 PM IST

Foot Over Bridge Collapsed in Visakha railway Station: విశాఖ రైల్వే స్టేషన్‌లోని ఫుట్ ఓవర్ వంతెన (Foot Over Bridge) పాక్షికంగా కుంగింది. 2, 3వ నెంబర్ ప్లాట్‌ఫాంలను అనుసంధానం చేసే వంతెన కుంగి ప్రమాదకరంగా మారింది. హైటెన్షన్ విద్యుత్ తీగలు తాకేలా బ్రిడ్జి ప్రమాదకరంగా మారటంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు ఫుట్ ఓవర్ బ్రిడ్జి (FOB) మీదుగా ప్రయాణికుల రాకపోకలు నిలిపివేశారు. సమాచారం అందుకున్న వాల్తేరు డీఆర్​ఎం (Waltair Divisional Railway Manager) సౌరభ్ ప్రసాద్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Drm Said Visakha Fob Repairs Immediately: రైల్వేస్టేషన్​లో కుంగిన వంతెన (Bended Bridge) పరిశీలించిన సౌరభ్ ప్రసాద్ మరమ్మతులు చేసేందుకు అధికారులతో చర్చించారు.  రైళ్ల రాకపోకలకు, ప్రయాణికులు ఎలాంటి అంతరాయం (no disruption to trains and passengers) లేదని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు (Repairs) చేపడతామని డీఆర్​ఎం (DRM) తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details