ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

గుడివాడలో రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు- గడువు తీరిన పదార్థాలు పట్టివేత - Food Safety Officers Raids Hotels - FOOD SAFETY OFFICERS RAIDS HOTELS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 7, 2024, 7:24 PM IST

Food Safety Officers Raids by Restaurants in Gudivada : కృష్ణా జిల్లా గుడివాడలోని రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టుల్లో ఆహార భద్రతా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పలు హోటళ్లలో నిబంధనలు పాటించకపోవడం, గడువు పూర్తైన ముడి పదార్థాలను ఉపయోగించడం, అపరిశుభ్ర వాతావరణాన్ని అధికారులు గుర్తించారు. ఒక రెస్టారెంట్లో ఆహార భద్రత విషయంలో సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవటం లేదని అధికారులు తెలిపారు. మాస్కులు, కుకింగ్​ అప్రాన్లు, గ్లౌజులు వంటివి ధరించకుండా ఆహారాన్ని వండుతున్నారని పేర్కొన్నారు. 

ఇటీవల ఏలూరు రోడ్డులోని కుళ్లిన మాంస ఉత్పత్తులను విక్రయించిన ఒక ఫుడ్ కోర్ట్​ను అధికారులు సీజ్ చేశారు. హోటళ్లలో కాలపరిమితి తీరిన ముడి పదార్థాలు, ఫంగస్ పట్టిన బ్రెడ్లు, హానికర కలర్స్ వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో నిబంధనలు పాటించని హోటళ్లపై సెక్షన్ 61 ప్రకారం జరిమానాలు విధిస్తామని ఉమ్మడి కృష్ణా జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ షేక్ గౌస్ మొహినుద్దీన్ తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాపారాలు చేయాలని హోటళ్ల యజమానులకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details