ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మమ్మల్నే ఆపుతారా ? ఫ్లైయింగ్​ స్క్వాడ్​తో వైఎస్సార్సీపీ నాయకుల వాగ్వాదం - Flying Squad Seiz Campaign Material - FLYING SQUAD SEIZ CAMPAIGN MATERIAL

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 12, 2024, 7:27 PM IST

Flying Squad Seized Election Campaign Material at Etukuru: మేమంతా సిద్థం అని సీఎం జగన్ అంటుంటే దాడులకైనా, గొడవలకైనా మేమూ సిద్ధమే అంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు పేట్రేగిపోతున్నారు. అధికారంలో ఉన్నది మా పార్టీనే, మేము ఏం చేసినా చెల్లుతుందని వ్యవహరించిన వైఎస్సార్సీపీ నాయకులకు అధికారులు షాక్ ఇచ్చారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోవటంతో అధికారులు తగిన బుద్ధి చెప్పారు.

జిల్లాలో ఏటుకూరు బైపాస్ రోడ్డులో జరిగే సీఎం జగన్ మేమంతా సిద్ధం సభ కోసం వైఎస్సార్సీపీ నాయకులు ప్రచార సామగ్రిని తరలిస్తుండగా ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు అడ్డుకున్నారు. ఆటోలో తీసుకెళ్తున్న వైఎస్సార్సీపీ  జెండాలు, ఫ్లెక్సీలకు అనుమతులున్నాయా అని అధికారులు వైఎస్సార్సీపీ నాయకులను అధికారులు ప్రశ్నించారు. అనుమతి పత్రాలు చూపించకపోగా అధికార పార్టీ వారినే ఆపుతారా అంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో ప్రచార సామగ్రితో వెళ్తున్న ఆటోను ఫైయింగ్ స్క్వాడ్ అధికారులు సీజ్ చేసి పట్టాభిపురం పీఎస్​కు తరలించారు. 

ABOUT THE AUTHOR

...view details