తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఖమ్మంలో సీఎం రేవంత్ పర్యటన - ముఖ్యమంత్రిని అడ్డుకున్న వరద బాధితులు - KHAMMAM FLOOD VICTIMS BLOCKS CM - KHAMMAM FLOOD VICTIMS BLOCKS CM

By ETV Bharat Telangana Team

Published : Sep 2, 2024, 8:31 PM IST

CM Revanth Reddy Inspect Flood Affected Areas in Khammam : గత రెండ్రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా అతలాకుతలమైపోయింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఖమ్మం నగరాన్ని వరదలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా మున్నేరు వాగు ఉప్పొంగి పరిసర ప్రాంతాలకు వరద పోటెత్తింది. చాలా ఇళ్లు నీటమునిగాయి. ప్రాణాలు అరచేత పట్టుకుని ప్రజలు వరద నుంచి బయటపడ్డారు. అయితే వర్షం తగ్గినా అక్కడ ఇంకా వరద తగ్గుముఖం పట్టలేదు.

ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన వెళ్లిన ఆయన మొదట సూర్యాపేట ఆ తర్వాత ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఖమ్మంలో వరద బాధితులకు తక్షణ సాయంగా రూ.10వేలు ప్రకటించారు. మరోవైపు వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.5 లక్షల పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. అయితే వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చిన మరుక్షణమే సీఎం రేవంత్‌ను ఖమ్మంలో బాధితులు చుట్టుముట్టారు. తమకు తక్షణమే సాయం అందజేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిని ముందుకు వెళ్లనీయకుండా ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అక్కడి నుంచి పంపివేశారు. అనంతరం రేవంత్ మరో ప్రాంతానికి వెళ్లారు. 

ABOUT THE AUTHOR

...view details