ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కోనసీమ లంక గ్రామాలను ముంచేసిన గోదావరి - డ్రోన్ విజువల్స్ - Flood Affect in Mummidivaram - FLOOD AFFECT IN MUMMIDIVARAM

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 12, 2024, 9:29 PM IST

Godavari Floods in Lanka Villages : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో ప్రవహించే గౌతమి, వృద్ధ గౌతమి గోదావరి నదీపాయలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. దీంతో వరద ప్రవాహానికి చేరువనున్న సుమారు 12 లంక గ్రామాలతోపాటు వేల ఎకరాల్లో మెట్ట పంటలు ముంపునకు గురయ్యాయి. కూనలంక, గురజాపులంక, లంక ఆఫ్ ఠాణేలంక రెండు నదీపాయలకు మధ్యలో ఉండడంతో వరద నీరు గ్రామాల్లోకి చేరింది. 

Flood Affect in Konaseema Drone Video : గురజాపులంక పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఐదు అడుగుల ఎత్తున వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. సలాదివారిపాలెం, కమిని, తాళ్లరేవు మండలం పరిధిలోని కొత్తలంక గ్రామాలను వరదనీరు తాకింది. ఐ.పోలవరం మండలం పరిధిలోని పశువుల్లంక వద్ద వృద్ధ గౌతమి గోదావరి పరవళ్లు తొక్కుతోంది.  లంక భూములు కోతకు గురవుతున్నాయి. 

ఎదురులంక బాలయోగి వారిధి వద్ద వరద ప్రవాహం వడివడిగా సముద్రం వైపు పారుతుంది. కొబ్బరి తోటలు ముంపు బారినపడి కోతకు గురవుతున్నాయి. మరోవైపు కేంద్రపాలిత ప్రాంతం యానాంలో రాజీవ్​పార్క్, భరతమాత విగ్రహం పరిసర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో బీచ్ సందర్శనకు పర్యాటకులను అనుమతించడం లేదు.

ABOUT THE AUTHOR

...view details