తెలంగాణ

telangana

ETV Bharat / videos

తొలి ఎయిర్‌ స్క్వాడ్రన్‌కు కమాండింగ్‌ ఆఫీసర్‌ మన హైదరాబాదీనే - Captain Abhishek Ram Interview - CAPTAIN ABHISHEK RAM INTERVIEW

By ETV Bharat Telangana Team

Published : Apr 10, 2024, 9:18 AM IST

First Commanding Officer of MH 60R Seahawk Helicopter Captain Abhishek Ram  : చిన్నతనం నుంచే మామయ్య స్ఫూర్తితో ఆర్మీ స్కూల్లో చదివాడు ఈ హైదరాబాదీ. పక్కా ప్రణాళికతో భారత నౌకాదళంలో అత్యున్నత స్థాయికి చేరాడు. అనతికాలంలోనే భారత నౌకాదళంలో టెస్టింగ్​ పైలెట్​ స్థాయికి చేరుకున్నాడు. ఇటీవలే అత్యంత శక్తిమంతమైన తొలి ఎయిర్‌ స్క్వాడ్రన్‌ నడిపే అద్భుత అవకాశం అందుకున్నాడు. సముద్ర లోతుల్లో దాగి ఉన్న శత్రు జలాంతర్గాములను క్షణాల్లోనే మట్టుబెట్టే ఎంహెచ్​ 60ఆర్(MH 60R) సీహాక్‌ హెలికాప్టర్‌కు మొదటి కమాండింగ్‌ ఆఫీసర్‌గా వ్యవహరించాడు. 

మిగిలిన హెలికాప్టర్​ల కన్నా ఎందుకు ఈ ఎంహెచ్​ 60ఆర్​ ప్రత్యేకమో చెప్పారు. తొలిసారి ఈ సీహాక్​ హెలికాప్టర్​ నడిపినప్పుడు పైలెట్​గా తన అనుభవాలను గురించి వివరించారు. నేవీలో చేరాలనుకునే యువతకు అతను మంచిని సందేహాన్ని ఇచ్చారు. నేవీలో అవకాశం వస్తే అస్సలు వదులుకోవద్దని హితవు పలికారు. అతనే కెప్టెన్​ అభిషేక్​ రామ్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. అతను పైలట్​గా ఎదుర్కొన్న సవాళ్లను అతను మాటల్లోనే తెలుసుకుందాం.

ABOUT THE AUTHOR

...view details