కారులో అగ్ని ప్రమాదం - తప్పిన ప్రాణనష్టం - హైదరాబాద్లో కారు అగ్ని ప్రమాదం
Published : Feb 3, 2024, 2:56 PM IST
Fire Accident In Hyderabad : హైదరాబాద్లో వాహనాల్లో వరుస అగ్ని ప్రమాదాలు(Fire Accidents) ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం రాత్రి కారులో ఉన్నట్టు ఉండి మంటలు చెలరేగాయి. ఈ ఘటన మాదాపూర్‌లోని నీరూస్ కూడలి వద్ద చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. కారులో అకస్మాత్తుగా పొగలు కమ్ముకుని మంటలు వ్యాపించాయి. వెంటనే అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు కిందకు దిగిపోయారు. దీంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం గురించి స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు.
Massive Fire Accident At Madhapur : ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తులో తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు.