ఫుట్‌పాత్‌పై ఉన్న దుకాణాల్లో భారీ అగ్నిప్రమాదం - అగ్నికి ఆహుతైన 2 హోటల్స్ - Fire Accident In Hyderabad
Published : Feb 19, 2024, 6:53 PM IST
Fire Accident In Filmnagar : హైదరాబాద్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్‌పేట్ వద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.షేక్‌పేట్ డివిజన్లో ఫుట్ పాత్ మీద ఉన్న దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానిక వ్యాపారస్థులు భయంతో పరుగులు తీశారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Filmnagar Fire Accident : ట్రాన్స్‌ఫార్మర్ నుంచి ఆయిల్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయని, దీంతో వైర్లకు మంటలు అంటుకొని పక్కనే ఉన్న దుకాణాలకు వ్యాపించాయని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో రెండు దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయన్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎండాకాలం సమీపిస్తుండటంతో అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు పోలీసులు సూచించారు.