ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

బద్వేల్ పోలీస్ సర్కిల్​ కార్యాలయంలో అగ్నిప్రమాదం - కాలి బూడిదైన కంప్యూటర్లు, ఫైల్స్ - Badvel Fire Accident Today - BADVEL FIRE ACCIDENT TODAY

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 29, 2024, 1:04 PM IST

Badvel Fire Accident Today : రాష్ట్రంలో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా వైఎస్సార్ జిల్లా బద్వేల్​లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామీణ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఆఫీసులో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలోనే దట్టమైన పొగలు కమ్ముకోవడంతో చుట్టు పక్కల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గమనించిన పోలీసు సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఫైర్​ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. 

Fire Accident Badvel Police Circle Office : ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అగ్ని మాపక శకటంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో కార్యాలయంలో ఉన్న ఫైల్స్, కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇన్వర్టర్​ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించిదని పోలీసులు తెలిపారు. కేసులకు సంబంధించిన కీలక దస్త్రాలు బీరువాలో సురక్షితంగా ఉన్నాయని సీఐ పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అక్కడివారు ఊపిరి పీల్చుకున్నారు. 

ABOUT THE AUTHOR

...view details