ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం- ప్రత్యక్షప్రసారం - Nirmala Sitharaman Live

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 1, 2024, 4:18 PM IST

Updated : Feb 1, 2024, 5:21 PM IST

Finance Minister Nirmala Sitharaman Live: త్వరలో లోక్​సభ ఎన్నికలు జరరగనున్న నేపథ్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్​ను ప్రవేశపెట్టారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. మొత్తం రూ.47.65లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించారు. అత్యధికంగా రక్షణ శాఖకు రూ.6.2 లక్షల కోట్లు కేటాయించారు. తాయిలాలు లేకుండా పద్దును ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన ఆమె సబ్ కా వికాస్, సబ్ ​కా సాత్​, సబ్ ​కా విశ్వాస్ లక్ష్యంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. గత పదేళ్లలో మోదీ నాయకత్వంలో అమలు చేసిన సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదం చేశాయన్నారు. కొత్త పారిశ్రామికవేత్తలు వెలుగులోకి వచ్చారని చెప్పారు.

వ్యవసాయానికి పెద్దపీట
'కునారిల్లుతున్న వ్యవసాయ రంగానికి మోదీ ప్రభుత్వం కొత్త ఊపిరి ఊదింది. మద్దతు ధరలు, పెట్టుబడి రాయితీలతో రైతులకు పలు ప్రయోజనాలు కల్పించింది. సమాజంలోని అన్ని వర్గాల వారికి కుల, మత, ఆర్థిక బేధాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించే ప్రయత్నాలు చేస్తోంది' అని సీతరామన్ తెలిపారు.

అసమానతలు లేని భారత్
2047 నాటికి దేశంలో అసమానత, పేదరికం అనేది కనబడకుండా చేయాలన్నదే మోదీ సర్కార్​ లక్ష్యమని నిర్మలా సీతారామన్ చెప్పారు. తమ ప్రభుత్వం ఆచరణీయమైన సెక్యులరిజం కోసం ప్రయత్నం చేస్తోందని అన్నారు. వారసత్వవాద వ్యతిరేకంగా పనిచేస్తోంది స్పష్టం చేశారు. కాగా బడ్జెట్​కు సంబంధించిన వివరాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం.

Last Updated : Feb 1, 2024, 5:21 PM IST

ABOUT THE AUTHOR

...view details