ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పిచ్చికుక్క దాడిలో 20మందికి గాయాలు- ముందే ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు - kadapa mad dogs attack

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 9, 2024, 12:33 PM IST

Few People Injured In Mad Dog Attack: తెలుగు రాష్ట్రాల్లో పిచ్చి కుక్కల దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే బెంబేలెత్తుతున్నారు. ఏ మూల నుంచి ఏ కుక్క దాడి చేస్తుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయాందోళనకు గురవుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోగా కుక్క కాట్ల బారిన పడుతున్నారు. 

Dog Attack In Kadapa: వైయస్​ఆర్ జిల్లా బద్వేలు తెలుగు గంగ కాలనీలో ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. సిద్ధవరం రోడ్డు, గాంధీ నగర్ వీధుల్లో తిరుగుతూ ప్రజలపై దాడికి దిగింది. ఈ దాడిలో 20మందికి గాయాలయ్యాయి. బాధితులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారి నుంచి స్పందన లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పిచ్చి కుక్క ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. పిచ్చికుక్కను పట్టుకునేందుకు పురపాలక అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details