తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కుమార్తె చావు ఫ్లెక్సీ కొట్టించిన తండ్రి - Father Protest on Daughter MArriage - FATHER PROTEST ON DAUGHTER MARRIAGE

By ETV Bharat Telangana Team

Published : Apr 8, 2024, 4:28 PM IST

Father Protest Against Daughter Love Marriage : అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె,  చిన్న వయసులోనే ప్రేమ పేరుతో ఆకర్షణకి లోనయ్యంది. విషయం తెలుసుకున్న తండ్రి వద్దని వారించాడు. కానీ ఆమె వినలేదు. చివరికి అమ్మనాన్నలను కాదని వెళ్లి ప్రియుడిని వివాహం చేసుకుంది. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన తండ్రి, తన కుమార్తె మరణించిందంటూ ఫ్లెక్సీ వేయించి వినూత్న నిరసన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే సిరిసిల్ల పట్టణంలో చిలువేరి మురళి కుమార్తె చిలువేరి అనూష బీటెక్​ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలోనే కాలేజీలో ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడి, అది కాస్త ప్రేమగా మారింది. ఏకంగా తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఇంట్లో నుంచి వెళ్లి, ప్రేమించిన వాడిని వివాహం చేసుకుంది. ఎన్నో ఆశలతో కుమార్తె పెళ్లిని ఘనంగా చేయాలని భావించిన తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. దీంతో మనస్తాపానికి గురైన చిలువేరి మురళి తన బిడ్డ చనిపోయింది అంటూ ఫ్లెక్సీ కొట్టించి నిరసన తెలిపాడు. ఈ పరిణామంతో ఇంట్లోని కుటుంబసభ్యులు, బంధువులు ఆ తండ్రి ఆవేదన చూసి బోరుమన్నారు. ఈ కష్టం పగోడికి కూడా రాకూడదంటూ కన్నీరుమున్నీరు అయ్యారు. 

ABOUT THE AUTHOR

...view details