భూమి విస్తీర్ణాన్ని తగ్గించి ఆన్లైన్లో నమోదు చేసిన అధికారులు - ఆందోళనకు దిగిన రైతులు - పాలకుర్తి రైతులు ధర్నా
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 2, 2024, 7:47 PM IST
Farmers Dharna at Collector Office in Kurnool District : కర్నూలు జిల్లాలో తమ ప్రమేయము లేకుండా పట్టా భూముల విస్తీర్ణమును ఆన్లైన్లో అధికారులు తగ్గించారని రైతులు ధర్నా నిర్వహించారు. కోడుమూరు నియోజకవర్గం పాలకుర్తికి చెందిన రైతులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పాలకుర్తి గ్రామంలోని సర్వే నంబరు 477, 475,478 ఎనిమిది మంది రైతులకు చెందిన పొలాల్లో ఒక్కొక్కరికి 30 సెంట్లు చొప్పున తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Palakurti Farmers : గత నాలుగు నెలల వ్యవధిలో ఎంఆర్ఓ బి. జయన్న, డిప్యూటి తహసీల్దారు రామాంజనేయులు, వీఆర్ఓ వెంకటరాముడు సహాకారముతో చింతా కృష్ణమూర్తికి ఆన్లైన్లో భూమిని ఎక్కించారని పాలకుర్తి రైతులు ఆరోపించారు. దీనిపై కలెక్టర్ సమగ్ర విచారణ చేసి తమకు న్యాయము చేయవలసిందింగా వినతి పత్రాన్ని అందజేశారు. తమ భూములను ఆన్లైన్ నందు యదావిధిగా పొందుపరచాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. తమకు న్యాయం చేసేవారు పోరాటం చేస్తామని పాలకుర్తి రైతులు పేర్కొన్నారు.