ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఇల్లు కట్టిస్తామని చంద్రబాబు హామీ - సంతోషంలో కుటుంబం - CBN STARTED PENSIONS DISTRIBUTION - CBN STARTED PENSIONS DISTRIBUTION

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 1, 2024, 11:49 AM IST

Family Happy with Received Pension through CM Chandrababu: రాష్ట్రవ్యాప్తంగా పింఛన్‌ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారులకు స్వయంగా పింఛను అందించారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఫించన్‌ పంపిణీ చేశారు. దీంతోపాటు వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు చేతులు మీదుగా పింఛన్‌ అందుకోవడం సంతోషంగా ఉందని లబ్ధిదారులు తెలిపారు. 

పెనుమాకలో పూరిల్లులో ఉన్న రాములు, ఆయన కుమార్తెకు సీఎం పింఛన్‌ అందజేశారు. కుటుంబ పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. ఈ క్రమంలో తన చేతుల మీదుగా పింఛను అందించిన రాములు కుటుంబానికి ఇల్లు కూడా కట్టిస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు హామీ ఇవ్వటంతో రాములు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పింఛన్ అందుకున్న రాములు కుటుంబంతో మా ప్రతినిధి ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details