'అవివీతి రహిత రాజకీయాలతో సరికొత్త చరిత్ర లిఖిస్తా '- పెమ్మసాని చంద్రశేఖర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి - Pemmasani Chandrashekar - PEMMASANI CHANDRASHEKAR
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 4, 2024, 4:56 PM IST
Face To Face with Pemmasani Chandrasekhar: తెలుగువారి చరిత్రలో పెమ్మసాని నాయకులది ప్రత్యేక స్థానం. ఇప్పుడు పెమ్మసాని వారసులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయంగా చైతన్యవంతమైన గుంటూరు జిల్లా నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్డీఏ కూటమి తరపున ఎంపీగా పోటీ చేస్తున్నారు. కొద్ది రోజుల్లోనే ప్రజల్లో, పార్టీ కార్యకర్తల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్నికల అఫిడవిట్ లో వేల కోట్ల ఆస్తులు ఎందుకు చూపాల్సి వచ్చింది. ఆరాచకంగా ప్రవర్తించే వారిపై ఆయన వైఖరి ఏంటి, అమరావతి విధ్వంసం, రాష్ట్రంలో సహజవనరుల దోపిడీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కావాల్సిన నాయకత్వం వంటి విషయాలపై ఈటీవితో ప్రత్యేకంగా మాట్లాడారు.
అమెరికాలో 20 ఏళ్లకు పైగా ఉన్నా, మన దేశంపై ఉన్న ప్రేమతో భారత పాస్ పోర్టు కూడా అలాగే ఉంచుకున్నానని, అవినీతి లేని రాజకీయాలతో కొత్త చరిత్ర రాస్తానని చెబుతున్న గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడి ఆయన అనేక విషయాలను పంచుకున్నారు.