ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉద్యోగంలో సవాళ్లను దాటుకుంటూ ముందుకెళ్లడమే నిజమైన సక్సెస్‌ : దీపికాపాటిల్ ఐపీఎస్​ - Deepika IPS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 30, 2024, 9:11 AM IST

deepika_ips (ETV Bharat)

F2F With Anakapalli SP Deepika IPS: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని చాలామంది అహర్నిశలు శ్రమిస్తుంటారు. దేశంలో అత్యున్నత ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్స్​ సర్వీసెస్​ పరీక్ష అంటే మాటలా. అందులో ఉద్యోగం సాధించి ప్రజలకు సేవలు చేయాలని చాలా మంది కలలు కంటారు. కొంత మంది ఐపీఎస్​నే డ్రీమ్​ జాబ్​గా భావిస్తారు. నిరంతరం శ్రమించి ఉద్యోగం సాధిస్తారు. ఆమె కూడా అదే కోవకు చెందుతుంది. మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్​ కొలువు సాధించి ఔరా అనిపించింది. వివిధ స్థాయిల్లో పనిచేసి ఇప్పుడు అనకాపల్లి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించింది.

సివిల్​ సర్వీసు సాధించడం కన్నా ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్లను దాటుకుంటూ వెళ్లడమే నిజమైన సక్సెస్​ అని అనకాపల్లి జిల్లా ఎస్పీ దీపికాపాటిల్​ పేర్కొన్నారు. సృష్టమైన లక్ష్యం ఎంచుకోని దాని కోసం నిరంతరం కష్టపడాలని యువతకు సూచించారు. చెడు స్నేహితులకు, వ్యసనాలకు దూరంగా ఉండాలని హితువు పలికారు. జీవితంలో ఎంత కష్టపడితే అంత పైకి వెళ్లుతారని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details