అప్పట్లో కోడికత్తి, ఇప్పుడు గులకరాయి దాడి- ఎన్నికల్లో లబ్ధి కోసమే జగన్ డ్రామాలు : న్యాయవాది సలీమ్ - Jagan Stone Case Lawer Saleem - JAGAN STONE CASE LAWER SALEEM
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 29, 2024, 9:24 AM IST
F2F With Jagan Stone Case Suspect Lawer Saleem : ఎన్నికల్లో లబ్ధి కోసమే వైఎస్సార్సీపీ నేతలు గులకరాయి దాడి డ్రామాకు తెరతీశారని న్యాయవాది సలీమ్ ఆరోపించారు. ఈ కేసులో నిందితుడు సతీష్‌కు బెయిల్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కోడికత్తి పేరుతో దళితుడైన శ్రీనివాస్‌ను ఇబ్బంది పెట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం గులకరాయి పేరుతో వెనుకబడిన వర్గాలకు చెందిన సతీష్‌ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కేసులో 'రావాలి జగన్, చెప్పాలి సాక్ష్యం' అని వాఖ్యానించారు.
జగన్ మోహన్ రెడ్డి నేరావృత వ్యక్తిగా విజయవాడ కోర్ట్ కు విన్నవించానని, ప్రతి ఎన్నికల ముందు ఆయన పై ఆయనే దాడి చేసుకుని ప్రజల సానుభూతి పొందుతాడని వాదించానని సలీమ్ పేర్కొన్నారు. గత ఎన్నికలో కోడికత్తి కేసులో జనుపల్లి శ్రీనివాస్‌ను ఇబ్బంది పెడితే ఈ సారి ఎన్నికకు గులకరాయి కేసులో సతీష్‌ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని తెలిపారు. కోడికత్తి కేసులో దళితుడైన శ్రీనివాస్, ఈ కేసులో వెనుక బడిన వర్గానికి చెందిన సతీష్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం సాగింది అన్నారు. న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేయడంతో వారికి ధన్యవాదాలు తెలియజేశారు.