ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కృష్ణపట్నం పోర్టు మూతపడడం రాష్ట్రానికే అవమానం : మాజీమంత్రి సోమిరెడ్డి - Krishnapatnam Port

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 27, 2024, 10:28 PM IST

EX Minister Somireddy: కృష్ణపట్నం పోర్టు ఈ నెలాఖరుకు మూసేస్తున్నారని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. జనవరి 29 నాటికి కార్గో కంటైనర్ మూత పడనుందని ఆయన అన్నారు. బొగ్గు బూడిద కంటైనర్‌తో ముత్తుకూరు కాలుష్యంతో దెబ్బతింటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనం, స్థానిక మంత్రి కాకాణి అవినీతితో పోర్టు పూర్తిగా ఉనికిని కోల్పోనుందని మండిపడ్డారు. ఇప్పటికే పోర్టును మూసేస్తున్నట్లు అన్​లైన్​ సందేశాలను పోర్టు యాజమాన్యం పంపించిందని మీడియా ముందు ఆధారాలు చూపించారు. పోర్టు మూతపడితే రాష్ట్రం ఆదాయాన్ని కోల్పోతుందని అన్నారు. పోర్టు మూతపడటం ఒక్క నెల్లూరుకే అవమానం కాదని, పూర్తి రాష్ట్రానికే అవమానం అని ఆవేదన వ్యక్తం చేశారు. 

"కృష్ణపట్నం పోర్టు ఈ నెలాఖారుకు మూసేస్తున్నారు. చివరి వెసెల్​ 29న రానుంది. అది ఇప్పుడు అక్కడ పార్క్​ అయి ఉంది. 29 వరకు అది ఖాళీ అవుతుంది. ఇక ఫిబ్రవరి నుంచి ఎలాంటి కార్గొ కంటైనర్​లు ఇక్కడికి రావు" - సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి

ABOUT THE AUTHOR

...view details