తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : దిల్లీ ఫలితాలపై ఈటీవీ భారత్ ప్రత్యేక​ చర్చా కార్యక్రమం - ప్రత్యక్ష ప్రసారం - DISCUSSION ON BJP WINNING IN DELHI

By ETV Bharat Telangana Team

Published : Feb 8, 2025, 9:26 AM IST

Special Discussion on BJP Winning in Delhi : దిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. నాలుగోసారి అధికారం కోసం ఆప్‌ గట్టిగానే ప్రయత్నించింది. 2013లో తొలిసారి అధికారం చేపట్టిన ఆమ్‌ ఆద్మీ పార్టీ, తొలిసారి కాంగ్రెస్‌ మద్దతుతో 48 రోజులే అధికారంలో ఉంది. 2014లో దిల్లీలో రాష్ట్రపతి పాలన కొనసాగింది. 2015 నుంచి వరుసగా రెండు సార్లు ఆప్ అధికారంలో ఉంది. కానీ దిల్లీలో 26 ఏళ్ల నుంచి అధికారం కోసం బీజేపీ ఎదురు చూస్తుంది. అయితే గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. 2020 ఎన్నికల్లో ఆప్‌ 62 సీట్లు గెలుపొందగా, బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించాయి. 2015 ఎన్నికల్లో ఆప్ 67, బీజేపీ 3 స్థానాల్లో గెలిచాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ బీజేపీ వైపే మొగ్గు చూపాయి. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం బీజేపీ మ్యాజిక్​ ఫిగర్ దాటి ఆధిక్యంలో దూసుకుపోతుంది. దిల్లీ ఫలితాల తీరుపై ఈటీవీ భారత్​ ప్రత్యేక చర్చా కార్యక్రమం మీకోసం. 

ABOUT THE AUTHOR

...view details