ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

జలదిగ్భందంలో జక్కంపూడి వైఎస్సార్‌ కాలనీ - తాగునీటికి అవస్థలు - Vijayawada Flood Victims Problems - VIJAYAWADA FLOOD VICTIMS PROBLEMS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2024, 8:13 PM IST

ETV Bharat Interaction With Vijayawada Flood Victims : వరద బీభత్సం నుంచి విజయవాడ నగరం క్రమక్రమంగా బయటపడుతోంది. వరద ముంపు ప్రాంతాల నుంచి  బాధితులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఎన్నడూ లేని విధంగా వర్షం కురవడంతో బుడమేరు ప్రభావానికి జక్కంపూడి వైఎస్సార్‌ కాలనీ ఇంకా జలదిగ్భందంలోనే కొనసాగుతోంది. ఇప్పటికీ వైఎస్సార్ కాలనీలో నడుంలోతు నీటి ప్రవాహం ఉంది. ముఖ్యమంత్రి పిలుపుతో వరద బాధితులకు ఆహారం, తాగునీరు అందించేందుకు మేమున్నామంటూ అనేక మంది ముందుకొచ్చారు. హెలికాప్టర్ల ద్వారా, డ్రోన్ల ద్వారా, ట్రాక్టర్ల ద్వారా ఆహారం అందిస్తున్నారు. పెద్ద మొత్తంలో ఆహారాన్ని బాధితులకు చెంతకు చేర్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

తాగునీటి కోసం స్థానికులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. జక్కంపూడి కాలనీతోపాటు అంబాపురం, కండ్రిక, పైపుల రోడ్డు నుంచి రాష్ట్ర అగ్నిమాపకశాఖ సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు బోట్ల సహాయంతో బాధితులను బయటకు తీసుకొస్తున్నారు. వారికి అవసరమైన మందులు, ఆహారాన్ని కూడా ఇళ్ల వద్దకే వెళ్లి అందిస్తున్నారు. జక్కంపూడి, వైఎస్సార్‌ కాలనీ, ఇతర ప్రాంతాల్లోని పరిస్థితుల గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. 

ABOUT THE AUTHOR

...view details