బాల మురుగన్‌కు ఆపన్న హస్తం- ఈటీవీ భారత్ కథనానికి స్పందించిన ఆర్డీవో - ETV Bharat Effect RDO React - ETV BHARAT EFFECT RDO REACT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 23, 2024, 1:06 PM IST
ETV Bharat Effect in Boy Suffering From Incurable Disease: వైఎస్సార్ జిల్లా బద్వేలులో అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న బాలుడిపై ఈటీవీ భారత్ -ఈనాడు కథనానికి స్పందన లభించింది. గత నెల 25న బాలుడిపై ఈటీవీ భారత్- ఈనాడు కథనం ప్రసారమైంది. దీంతో బద్వేలు ఆర్డీవో వెంకటరమణ స్పందించారు. అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న జనార్దన్ మురుగన్ ఇంటికి వెళ్లి ఆయన పరామర్శించారు. దాదాపు గంటసేపు బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి మురుగన్ ఆరోగ్యంపై ఆరా తీశారు.
Badvel RDO React With ETV Bharat Article: బాలుడి వ్యాధికి సంబంధించిన పత్రాలను పరిశీలించారు. బాలుడిని దగ్గరకు తీసుకుని ఆర్డీవో ఆప్యాయంగా పలకరించారు. బాలుడిని పాఠశాలలో చేర్పించడంతోపాటు ప్రభుత్వపరంగా సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. జనార్దన్ వైద్యం కోసం తన శాయశక్తులా కృషి చేస్తానని బాలుడి కుటుంబ సభ్యులకు ఆర్డీవో హామీ ఇచ్చారు. అనంతరం బాలుడితో సెల్ఫీ తీసుకున్నారు. ఈటీవీ భారత్ -ఈనాడు కథనంతో దాతలు ముందుకు వస్తున్నారని బాలుడి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.