ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

జీపీఏఫ్ ఖాతా నిధులు ప్రభుత్వం దొంగతనం చేసింది: సూర్యనారాయణ - GOVT WITHDRAW FUNDS FROM GPF - GOVT WITHDRAW FUNDS FROM GPF

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 18, 2024, 1:57 PM IST

Government Withdraw funds From GPF Accounts: ప్రభుత్వ ఉద్యోగులు జీపీఎఫ్ (GPF) ఖాతాలో దాచుకున్న సొమ్మును ప్రభుత్వం దొంగతనంగా కాజేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఐక్యవేదిక ఛైర్మన్‌ కేఆర్‌ సూర్యనారాయణ ఆరోపించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, పెన్షనర్ల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో సూర్యనారాయణ పాల్గొన్నారు. పేరుకుపోయిన ఉద్యోగుల బకాయిలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Government Employees Union Chairman  Fired On Ysrcp: ఉద్యోగుల అనుమతి లేకుండా ప్రభుత్వం జీపీఎఫ్ ఖాతాల నుంచి డెబిట్ చేసిందని, అనుమతి లేకుండా డబ్బులు తీసుకోవటం అనేది దొంగతనంగా పరిగణిస్తామని సూర్యనారాయణ అన్నారు. ఈ దొంగల్ని ప్రభుత్వం ఇప్పటివరకూ ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. 25 వేల కోట్లకు పైగా బకాయిలు, ప్రతి నెలా జీతభత్యాల చెల్లింపులు, వేతన సవరణ పెండింగ్ ఉన్నాయని సూర్యనారాయణ పేర్కొన్నారు. ఇన్ని వేల కోట్లు బకాయిలు ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుంది, ఏ విధంగా చెల్లిస్తుందని ఉద్యోగుల్లో అభద్రతాభావం ఉందని సూర్యనారాయణ  తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details