ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సం- స్పందించని అటవీ యంత్రాంగం! - Elephant Wandering In Chittoor

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 20, 2024, 10:41 PM IST

Elephant Attack on Crop in Chittoor District : చిత్తూరు జిల్లాలో ఓ ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. జిల్లాలోని పలమనేరు మండలం ముసలిమడుగు సమీపప్రాంతాల్లో ఓ ఒంటరి ఏనుగు సంచరిస్తుంది. ఈరోజు రామచంద్ర నాయుడు అనే రైతు పొలంలోకి ఈ ఏనుగు చొరబడి అక్కడి రేకుల షెడ్డును ధ్వంసం చేసింది. అంతేగాక అందులో ఉన్న ఐదు మూటల పశువుల దానాను నాశనం చేసింది. పక్కనే ఉన్న వరి పంట, అలాగే అర ఎకరంలో వేసిన అరటి తోటలను సైతం గజరాజు నాశనం చేసింది. 

Elephants Damaged Crops : ఏనుగు దాడిలో సుమారు 50 వేల రూపాయల వరకు పంట నష్టం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదని రైతు వాపోయాడు. గజరాజు సంచారంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రైతులు పొలం పనులను వెళ్లాలన్నా జంకుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకుని ఏనుగులు పొలాల్లోకి రాకుండా అరికట్టాలని రైతులు కోరుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details