LIVE : రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీ రావుకు అంతిమవీడ్కోలు - RAMOJI RAO LAST RITES LIVE
Published : Jun 9, 2024, 9:23 AM IST
|Updated : Jun 9, 2024, 11:51 AM IST
Ramoji Groups Chairman Ramoji Rao Funeral Live : ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు అంతిమ సంస్కారాలు నేడు రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతున్నాయి. ఉదయం 9 గంటలకు రామోజీరావు నివాసం నుంచి అంతిమ యాత్ర మొదలైంది. రామోజీ ఫిల్మ్‌సిటీ ప్రాంగణంలో అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంతిమ సంస్కారాలను నిర్వహిస్తున్నారు. ఆయనకు ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఘన నివాళులర్పించారు. రామోజీరావు మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నామని పలువురు నేతలు అన్నారు. ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంలో ఆయన్ను ఆసుపత్రిలో చేరారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు స్టంట్ అమర్చారు. అనంతరం రామోజీ రావుకు ఐసీయూలో చికిత్స అందించారు. ఈనాడుతో వ్యావహారిక తెలుగుకు పెద్దపీట వేసిన రామోజీరావు తెలుగు భాషాభిమానుల కోసం 'తెలుగు వెలుగు' మాసపత్రికను నడిపారు. ఇలా తెలుగు భాషకీ, సమాజానికీ ఇతోధిక సేవ చేసిన రామోజీరావు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇది తెలుగు భాషాభిమానులకు తీరని లోటు.
Last Updated : Jun 9, 2024, 11:51 AM IST