వరంగల్‌లో వరద బాధితులకు రామోజీ గ్రూప్ అండ - ఇంటింటికీ వెళ్లి నిత్యవసర వస్తువుల పంపిణీ - Ramoji Group Donation to Victims
Published : Sep 6, 2024, 3:59 PM IST
Ramoji Group Food Distribution in Warangal : ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు వరంగల్ నగరంలో నీట మునిగిన పలు లోతట్టు ప్రాంతాల ప్రజలకు, సాయం కోసం ఎదురు చూస్తున్న బాధితులకు రామోజీ గ్రూప్ అండగా నిలిచింది. బాధితులకు రామోజీ గ్రూప్ ఆహార వస్తువులతో కూడిన సంచులను అందచేసి వారి ఆకలి తీర్చింది. డీకే నగర్, ఎన్టీఆర్ నగర్, సంతోషిమాత, బీఆర్ నగర్ గుడిసెలు, ఎంఎన్ఆర్ నగర్ తదితర కాలనీల్లో రెక్కాడితే కానీ డొక్కాడని వారికి రామోజీ గ్రూప్ సంస్ధ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి సరుకులను అందజేశారు.
వరదకు ఇళ్లల్లో ధాన్యం, బియ్యం, నిత్యవసర సరుకులు, దుస్తులు, పుస్తకాలు, విలువైన వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు అన్నీ పనికి రాకుండా పోయాయి. ఈ నేపథ్యంలో బాధితులకు రామోజీ గ్రూప్ అండగా నిలుస్తూ సంస్ధ ఉద్యోగులు వరద నీటిలోనే నడుచుకుంటూ సహాయ సామాగ్రి బ్యాగులు ఇచ్చారు. రామోజీ గ్రూపు సాయంపై నిరుపేదలు సంతోషం వ్యక్తం చేశారు. కష్ట కాలంలో ఆదుకున్నారంటూ సంస్ధ యాజమాన్యానికి కృతజ్ఞతలు చెప్పారు.