ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఐదు దశాబ్దాలుగా రాజీలేని పోరాటం - ఇది ఈనాడు చరిత్ర - Eenadu Golden Jubilee Celebrations

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 10, 2024, 4:10 PM IST

Updated : Aug 10, 2024, 4:18 PM IST

Eenadu Golden Jubilee Celebrations: తెలుగుభాషకు పట్టం కట్టి, పట్టాభిషేకం చేసిన భాషా ప్రేమికుడు. తెలుగుజాతి ఘనకీర్తి శాశ్వతంగా నిలిచిపోయేలా ఆంధ్రుల రాజధానికి అమరావతిగా నామకరణం చేసిన చరితార్థుడు రామోజీరావు (Ramoji Rao). ఆయన స్థాపించిన ఈనాడు పత్రిక 50వ వార్షికోత్సవం జరుపుకోవటం తెలుగుజాతికే గర్వకారణం. దిల్లీ వార్తలను గల్లీకి లాక్కొచ్చి పేదల కష్టాలను పతాక శీర్షికలకు ఎక్కించి,  పరిశోధనాత్మక కథనాలై అగ్ని కణికలై, ఆపన్న హస్తాలై జీవితాలను మార్చాయి. అమృత సంజీవినిలా ప్రాణాలను నిలబెట్టాయి. 

Eenadu@50: ఐదు దశాబ్దాల ఆగ్రసానాధిపత్యమైనా, నలుచెరుగుల విస్తరణ అయినా, ఆ ఘనత పాఠకులదే. ఈనాడు విజయాల గజమాల వారికే. "ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే తెలిసిన ఈనాడు లక్ష్యం ఒక్కటే. సమాచారం లోపం వల్ల తెలుగు పాఠకులు వెనక పడిపోవద్దు అనేదే ఈనాడు ఫిలాసఫీ. ప్రజలందని ఆదరణ, అభిమానాలే ఈనాడుకి శక్తి, స్ఫూర్తి" అని ఈనాడు వ్యవస్థాపకులు రామోజీరావు ఒకానొక సందర్భంలో అన్నారు. ప్రజల హక్కుల కోసం నిత్యం రాజీలేని పోరాటం చేస్తున్న 'ఈనాడు' నేడు 50వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. 

Last Updated : Aug 10, 2024, 4:18 PM IST

ABOUT THE AUTHOR

...view details