ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE : తిరుమలలో శ్రీవారి ధ్వజారోహణ సేవ - ప్రత్యక్షప్రసారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Updated : 3 hours ago

Dwajarohanam Ceremony in TTD Live : తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆలయం నుంచి వరాహస్వామి ముఖమండపానికి ఉత్సవర్ల తరలింపు కార్యక్రమం జరుగుతుంది. ముందుగా వరాహస్వామి ముఖ మండపంలో స్నపన తిరుమంజనం జరుగుతుంది. ఉత్సవర్ల స్నపన తిరుమంజనం అనంతరం చక్రస్నానం ఉంటుంది. 8 రోజులు వివిధ వాహనాల్లో దర్శనమిచ్చిన మలయప్పస్వామి రాత్రి 7 గం.కు ధ్వజావరోహణం సేవతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. 8 రోజుల పాటు వివిధ వాహనసేవలపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అలరించిన మలయప్పస్వామికి చివరిరోజు పుష్కరిణిలో చక్రస్నానం కన్నులపండువగా సాగింది. ఉదయం శ్రీవారి పుష్కరిణిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామికి, చక్రత్తాళ్వర్ కు అర్చకులు శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించారు. ఎలాంటి పొరపాట్లుకు తావులేకుండా బ్రహ్మోత్సవాలను ఘనంగా ముగించినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. వాహన సేవలను 15 లక్షల మంది భక్తులు వీక్షించారని ఆయన వివరించారు. గత అనుభవాల దృష్ట్యా పకడ్బందీగా ప్రణాళికలు రచించామన్నారు. ఎప్పటికప్పుడు భక్తుల నుంచి సూచనలు, సలహాలు తీసుకుని తదననుగుణంగా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి ధ్వజారోహణ సేవ కార్యక్రమం జరుగుతుంది. ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : 3 hours ago

ABOUT THE AUTHOR

...view details