కూటమి నేతలపై తప్పుడు కేసులు పెట్టడమే వైసీపీ దురాలోచన: సీఎం రమేశ్ - 41A NOTICES TO CM RAMESH - 41A NOTICES TO CM RAMESH
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 8, 2024, 6:52 PM IST
DSP Issued Notice to BJP Leader CM Ramesh : అనకాపల్లి జిల్లా చోడవరం పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ అప్పలరాజు ముందు అనకాపల్లి లోక్‌సభ ఎన్డీయే అభ్యర్థి సీఎం రమేశ్, చోడవరం అసెంబ్లీ అభ్యర్థి కెఎస్‌ఎన్‌ఎస్ రాజు హాజరయ్యారు. ఈ నెల 4వ తేదీన చోడవరం మండలం గాంధీ గ్రామంలో టైల్స్ దుకాణంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు (DRI Officers) తనిఖీలు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారని అసిస్టెంట్ డైరెక్టర్ సోమేష్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీఎస్పీ అప్పలరాజు ఇటీవల సీఎం రమేశ్, కెఎస్‌ఎన్‌ఎస్ రాజుకు 41ఎ నోటీసులు ఇచ్చారు.
ఈ మేరకు సీఎం రమేశ్, రాజు విచారణ అధికారి ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ఎన్నికలు ఉన్న తరుణంలో రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులను జీఎస్టీ అధికారులుగా చెప్పి అందరినీ నమ్మించారని ఆయన తెలిపారు. వారిని తొలగించాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు రమేశ్ పేర్కొన్నారు. తాము అధికారులను బెదిరించి అక్కడ ఉన్న ఆధారాలను తారుమారు చేసినట్లు దొంగ కేసు పెట్టారని ఆయన ఆరోపించారు.