ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పాలకుల అలసత్వంతో బద్వేలులో గుక్కెడు నీటికోసం ప్రజల అవస్థలు - Drinking Water Problems in Kadapa District

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 7, 2024, 4:05 PM IST

drinking_water_problems_in_kadapa_district (ETV Bharat)

Drinking Water Problems in Kadapa District : కడప జిల్లా బద్వేల్ పురపాలిక సంఘంలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. గత పాలకుల నిర్లక్ష్యంతో గుక్కెడు నీటి కోసం రేయింబవళ్లు అవస్థలు పడాల్సి వస్తుందని మహిళలు వాపోయారు. తాగునీటి కోసం వ్యవసాయ బోర్ల వద్దకు చీకటిలో పరుగు తీయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రహ్మం సాగర్ తాగునీటి పథకం కోసం 130 కోట్ల రూపాయలను కేటాయిస్తే వాటిని పూర్తి స్థాయిలో వినియోగించలేదని మండిపడ్డారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదని మహిళలు వాపోయారు.


Drinking Water Crisis : కూలీ చేసుకుని జీవించే పేదలు తమ సంపాదనలో తాగునీటికి కొంత వెచ్చించాల్సి వస్తుంది ఎనిమిది రూపాయలు ఉన్న బిందె 15రూపాయలకు నీటి వ్యాపారులు పెంచారని బాధపడుతున్నారు. అదే ప్రభుత్వం ఉచితంగా నీటి సరఫరా చేస్తే తమలాంటి పేదలకు కష్టాలు ఉండవని చెబుతున్నారు. ఇప్పటికైనా పురపాలక అధికారులు తాగునీటి సమస్యను తీర్చాలని వేడుకుంటున్నారు.
 

ABOUT THE AUTHOR

...view details