LIVE: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన డోలా బాల వీరాంజనేయస్వామి - ప్రత్యక్ష ప్రసారం - Dola charge as minister - DOLA CHARGE AS MINISTER
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 26, 2024, 10:27 AM IST
|Updated : Jun 26, 2024, 10:39 AM IST
Dola Sree Bala Veeranjaneya Swamy Charge As Minister : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమం, దివ్యాంగుల, సీనియర్ సిటిజన్స్ సంక్షేమం మరియు సచివాలయం గ్రామ వాలంటీర్ల శాఖ మంత్రివర్యులుగా డా. డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి బాధ్యతలు చేపట్టారు. అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖామంత్రి డోలా వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో వివిధ శాఖల వారిగా మంత్రి అధ్యక్షతన వారం క్రితం తొలిసారి సమీక్ష నిర్వహించారు. . ప్రజా సమస్యల పట్ల అవగాహనతో ప్రజా ప్రతినిధులు మాట్లాడి ఎన్నో ఎళ్లు అయిందని వ్యాఖ్యానించారు. క్షేత్ర స్థాయిలో ఉన్న ఇబ్బందులు, పాలనా వైఫల్యాలను క్షుణ్ణంగా సమీక్షించి ప్రజా పాలనకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా తాగునీటి సమస్యలపై శాసన సభ్యులు ప్రశ్నలు సంధించారు. ఒంగోలు పట్టణంలో తాగునీటి సరఫరా బాగోలేదని, పెర్ణమెట్ట వద్ద రిపేర్లు చేయాల్సి అన్నా పట్టించుకోవడం లేదన్నారు. సాగునీటి ప్రాజెక్ట్లు మెరుగుపరచాలని, గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్లు త్వరితగతిన ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన డోలా బాల వీరాంజనేయస్వామి - ప్రత్యక్ష ప్రసారం
Last Updated : Jun 26, 2024, 10:39 AM IST