తెలంగాణ

telangana

ETV Bharat / videos

మూడేళ్ల చిన్నారిపై కుక్కల దాడి - సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు - Dogs Attack on Three Years Boy - DOGS ATTACK ON THREE YEARS BOY

By ETV Bharat Telangana Team

Published : Jul 10, 2024, 9:27 PM IST

Dogs Attack on Three Years Old Boy : సంగారెడ్డిలో కుక్కల దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గత రెండు రోజుల ముందు 12వ వార్డులో ఆరేళ్ల బాలుడిపై కుక్కల దాడి మరవక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. సంగారెడ్డిలోని శాంతినగర్​లో మూడేళ్ల బాలుడిని వీధి కుక్కలు తీవ్రంగా గాయపరిచారు. శాంతినగర్​కు చెందిన షాబాజ్ పాషా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న సమయంలో గుంపుగా అతనిపై దాడి చేశాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే కుక్కలను తరమడంతో ప్రాణాపాయం తప్పింది.

Dogs Attack on Children in Sangareddy : అనంతరం గాయపడిన బాలుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాలుడికి ప్రాణాపాయం తప్పినా తీవ్ర గాయాలయ్యాయి. సంగారెడ్డి పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, వాటిని నియంత్రించాలని మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు మొద్దునిద్ర వీడి ఇకనైనా వీధి కుక్కలను నియంత్రించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.     

ABOUT THE AUTHOR

...view details