ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పింఛన్ పంపిణీ వ్యవహారంపై వైసీపీ రాజకీయాలు - దివ్యాంగుడి వీడియో వైరల్​ - Misleading On Pension Distribution - MISLEADING ON PENSION DISTRIBUTION

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 3, 2024, 8:17 PM IST

 YCP Misleading On Pension Distribution: పింఛన్ పంపిణీని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయంటూ అధికార వైసీపీ ప్రచారం చేస్తోంది. మరోవైపు తాము పింఛన్ పంపిణీకి వ్యతిరేకం కాదని, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల అనుగుణంగా పింఛన్ పంపిణీ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పింఛన్ పంపిణీలో అనిశ్చితి నెలకొన్న వేళ, ఓ దివ్యాంగుడు వీడియో ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం పింఛన్ పంపిణీ పేరుతో రాజకీయాలు చేస్తుందని ఆరోపించాడు. 

 అన్నమయ్య జిల్లా కలికిరి మండలం మహల్ గ్రామానికి చెందిన షబ్బీర్ హుస్సేన్ పింఛన్ల పంపిణికి సంబందించి వీడియో రూపంలో తన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అబద్ధపు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. చంద్రబాబు పింఛన్ ఆపించారని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వీరు చేసే ప్రచారం మనం నమ్మకూడదని పిలుపునిచ్చారు. ఒక్క సారి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. ప్రభుత్వం దగ్గర ఖజానా లేకపోవడంతోనే పింఛన్ ఇవ్వడం లేదని ఆరోపించారు. పింఛన్ లబ్ధిదారులు మరోమారు మోసపోకూడదని హెచ్చరించారు. మరోసారి వైసీపీకి అధికారం అప్పగిస్తే, రాష్ట్రాన్ని అమ్మెస్తారని ఎద్దేవా చేశారు. గతంలో వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు సైతం పింఛన్లు తీసుకోలేదా అని ప్రశ్నించారు. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మకూడదని పేర్కొన్నారు.  

ABOUT THE AUTHOR

...view details