ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విజయనగరం కలెక్టరేట్ వద్ద అగ్రిగోల్డ్‌ బాధితుల ధర్నా - Dharna of Agrigold Victims

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 19, 2024, 4:36 PM IST

dharna_of_agrigold_victims_at_collectorate_vizianagaram (ETV Bharat)

Dharna of Agrigold Victims at Collectorate Vizianagaram : అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లించాల్సిన బాకాయిలను తక్షణమే విడుదల చేయాలంటూ విజయనగరం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట బాధితులు ధర్నా చేపట్టారు. అగ్రిగోల్డ్‌ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘం నాయకులు సంయుక్త కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. సీఐడీ అటాచ్‌ చేసిన భూములను వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి కుమారుడు కాజేశారని ఆరోపించారు. భోగాపురం విమానాశ్రయం సమీపంలో సుమారు 2 వేల కోట్ల రూపాయల విలువైన భూములు సంస్థ పేరు మీద ఉన్నాయన్నారు. వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 

కొన్ని రోజుల క్రితం మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేశ్‌ కుమారుడు రాజీవ్‌ అరెస్టుపై ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. వైఎస్సార్సీపీ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించి, రౌడీయిజం చేసిన వ్యక్తి జోగి రమేష్ ఇవాళ నీతులు మాట్లాడుతున్నారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విదితమే.

ABOUT THE AUTHOR

...view details