తెలంగాణ

telangana

ETV Bharat / videos

ప్రజాభవన్‌ వద్ద దళితబంధు నిధుల కోసం బాధితుల ధర్నా - వెంటనే అకౌంట్లో జమచేయాలని డిమాండ్ - Dharna For Dalit Bandhu Funds - DHARNA FOR DALIT BANDHU FUNDS

By ETV Bharat Telangana Team

Published : Aug 23, 2024, 1:05 PM IST

Dharna For Dalit Bandhu Funds :  రెండో విడత దళిత బంధు లబ్ధిదారులకు ఇప్పటికీ ఖాతాలో డబ్బులు జమ కాలేదని, వెంటనే వాటిని అకౌంట్లలో వేయాలని డిమాండ్ చేస్తూ దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో ప్రజాభవన్ ఎదుట బాధితులు ధర్నా నిర్వహించారు. తమకు నిధులు విడుదలైనా కూడా ఖాతాల్లో జమ కాలేదని దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడు కోయిల మహేశ్ అన్నారు.  

వారం రోజుల్లో జమ అవుతాయని ఖమ్మంలో డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారన్న మహేశ్ 15 రోజులవుతున్నా ఎలాంటి స్పందనా లేదని మండిపడ్డారు. రూ.3 లక్షలు ఇప్పటికే గ్రౌండింగ్ అయ్యాయని, నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల కోడ్​తో అవి ఖాతాలో జమ కాలేదని, కోడ్ ముగిసిన తర్వాత కూడా ఇలా జాప్యం చేయడం తగదని మండిపడ్డారు. డిప్యూటీ ముఖ్యమంత్రి దళిత బిడ్డ అయినప్పటికీ కూడా ఇలా ఆలస్యం చేయడం మంచిది కాదన్నారు. దళిత బంధు డబ్బులు జమ చేయకుంటే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొడతామని, ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. 

ABOUT THE AUTHOR

...view details