రానున్న ఎన్నికల్లో వాలంటీర్లే వైసీపీ తరపున బూత్ ఏజెంట్లుగా కూర్చోవాల్సిన పరిస్థితి : మంత్రి ధర్మాన ప్రసాదరావు - వాలంటీర్లే వైసీపీ బూత్ ఏజెంట్లు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 21, 2024, 8:21 PM IST
Dharmana Prasad Rao Chief Guest Volunteer Awards Ceremony in Srikakulam District : ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పాల్గొనడానికి వీల్లేదని ఎన్నికల సంఘం సృష్టంగా చెబుతుంటే మంత్రి ధర్మాన ప్రసాదరావు మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధర్మాన ప్రసాదరావు హాజరయ్యారు.
రానున్న ఎన్నికల్లో వాలంటీర్లే వైసీపీ తరపున బూత్ ఏజెంట్లుగా కూర్చోవాల్సిన పరిస్థితి ఉంటుందని ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. ఈ విషయంలో వాలంటీర్లకు ఎలాంటి అడ్డంకి ఉండదని చెప్పుకొచ్చారు. 80 ఏళ్లు దాటిన వృద్దులు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ ఇచ్చినందున ఈ ఓట్ల విషయంలో వాలంటీర్లు కీలకపాత్ర పోషించాలని సూచించారు. వాలంటీర్లు అంటే ఎటువంటి ఫలితం ఆశించని స్వచ్చంద సేవకులు అని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వం పడితే వేల సంఖ్యలో గుండె ఆగి చనిపోతారని ధర్మాన ప్రసాదరావు జ్యోసం చెప్పారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధర్మాన ప్రసాదరావు ధీమా వ్యక్తం చేశారు.