యాదాద్రీశుడి ఆలయానికి పోటెత్తిన భక్తులు - దర్శనానికి 3 గంటల సమయం - Devotees Rush in Yadadri Temple - DEVOTEES RUSH IN YADADRI TEMPLE
Published : May 26, 2024, 11:57 AM IST
Devotees Rush in Yadadri Temple : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆలయంలో ఉదయం నుంచే ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. శ్రీసుదర్శన నారసింహ హోమం, శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణం క్రతువులో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు. వేసవి సెలవులు పూర్తి కావొస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండగా దర్శనానికి సుమారు 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. శనివారం ఒక్క రోజుకే రూ.62,55,860 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వెల్లడించారు.
Yadadri Lakshmi Narasimha Swamy Temple Rush : ఆలయంలో స్వామివారి అభిషేక పూజల్లో, నిత్య కల్యాణంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువ ఉండటంతో ప్రసాద విక్రయశాల, ఆలయ ఆవరణలో సందడి నెలకొంది. కల్యాణకట్ట, పుష్కరిణి, ఘాట్ రోడ్డు వాహనాల పార్కింగ్ పరిసరాలు సందడిగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.