తెలంగాణ

telangana

ETV Bharat / videos

ధరణి కమిటీ తుది నివేదిక ఆధారంగా సమస్యల పరిష్కారిస్తాం: భట్టి విక్రమార్క - Dy CM Bhatti Vikramarka On Dharani - DY CM BHATTI VIKRAMARKA ON DHARANI

🎬 Watch Now: Feature Video

By ETV Bharat Telangana Team

Published : Jul 25, 2024, 3:26 PM IST

DY CM Bhatti Vikramarka On Dharani Problems : ధరణి కమిటీ అధ్యయనం తర్వాత పూర్తి స్థాయి భూసమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్​ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం కుట్రపూరితంగా తెచ్చిన ధరణి వల్ల లక్షలాది మంది రైతులు ఇబ్బందులు పడ్డారని వెల్లడించారు.

ధరణిలో 35 లావాదేవీల మాడ్యూళ్లు, 10 సమాచార మాడ్యూళ్లతో క్షేత్రస్థాయిలో సమస్యలకు కొంత పరిష్కారం చూపించామని వివరించారు. సాక్షాత్తు హైకోర్టు ధరణిలోని ఎన్నో లోపాలను ఎత్తిచూపిందని భట్టి విమర్శించారు. ధరణి కమిటి తుది నివేదిక ఆధారంగా సమస్యలను పరిష్కారిస్తామని ఆయన హామీ ఇచ్చారు. బడ్జెట్​ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్​ హాయంలో జరిగిన కార్యక్రమాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2024 బడ్జెట్​లో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు అధిక నిధులు కేటాయించినట్లు ఆయన వివరించారు. గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకం స్థానంలో రైతు భరోసాను తమ ప్రభుత్వం తెచ్చిందని తెలిపారు.  

ABOUT THE AUTHOR

...view details