తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క - bhatti visits Tirumala - BHATTI VISITS TIRUMALA
Published : Aug 11, 2024, 10:49 AM IST
Bhatti Vikramarka And Family Visits Tirumala : ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఏపీలోని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న ఆయనకు, రచన అతిథి గృహం వద్ద టీటీడీ అధికారి సత్రె నాయక్ స్వాగతం పలికారు. ఆదివారం వేకువజామున కుటుంబ సభ్యులతో కలిసి భట్టి స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. పాడి పంటలతో తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించానని భట్టి తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో పంటలు బాగా పండి రైతులు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం కలిసి పని చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణలో ప్రజాపాలన ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగుతోందని, రాబోయే కాలంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలు చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.