ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తుంగభద్ర డ్యాంలో అధికారుల పూజలు- స్టాప్ లాగ్‌ గేటు ఏర్పాటుకు సన్నాహాలు - Pooja in Tungabhadra New Gate - POOJA IN TUNGABHADRA NEW GATE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 14, 2024, 6:12 PM IST

Dam Officials Pooja at Tungabhadra New Gate: తుంగభద్ర జలాశయంలో గల్లంతైన గేటు స్థానంలో తాత్కాలిక గేటు ఏర్పాటుకు పనులు మొదలయ్యాయి. తుంగభద్ర 19వ నెంబర్ గేట్‌ వద్ద డ్యామ్ అధికారులు పూజలు చేసి పనులు ప్రారంభించారు. కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో జలాశయ అధికారులు కొట్టుకుపోయిన గేటు స్థానంలో స్టాప్ లాగ్‌ గేటును అమర్చనున్నారు. ఇప్పటికే ప్రత్యేక క్రేన్లు తీసుకువచ్చారు. కొత్త గేటును జిందాల్ నుంచి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. రాత్రిలోగా గేట్ల విడి భాగాలు డ్యామ్‌ వద్దకు చేర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 5 పలకల గేటు డ్యాం వద్దకు చేరుకున్న వెంటనే స్టాప్‌ లాగ్‌ గేటు బిగించే పనులు ప్రారంభిస్తారు. 

స్టాప్‌ లాగ్‌ గేటు కోసం ఐదు ముక్కలు సిద్ధం చేయిస్తున్నారు. ఇందులో మూడు ముక్కల తయారీని జిందాల్‌ సంస్థ ఇప్పటికే ప్రారంభించింది. మిగతా రెండు ముక్కల్ని నారాయణ, హిందుస్థాన్ సంస్థలు తయారు చేయనున్నాయి. వీటన్నింటినీ అతుకు పెట్టనున్నారు. సహజంగా నీరంతా వెళ్లిపోయాక కొత్తగా గేటు ఏర్పాటు చేస్తారు. అలా చేస్తే 60 టీఎంసీల నీరు వృథాగా పోతుంది. ఈ నాలుగు రోజుల్లోనే దాదాపు 28 టీఎంసీల నీరు వృథాగా వదిలేయాల్సి వచ్చింది. డ్యాంలో నీటిమట్టం అడుగంటితే ఇప్పటికే పైర్లు వేసి పెట్టుబడులు పెట్టిన ఆయకట్టు రైతులు వేల కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. 

ABOUT THE AUTHOR

...view details