ETV Bharat / state

హైదరాబాద్‌ నార్త్​ సిటీ వాసులకు న్యూ ఇయర్​ గిఫ్ట్​ - ఆ ప్రాంతాలకు మెట్రో పొడిగింపు - METRO FOR HYDERABAD NORTH ZONE

హైదరాబాద్‌ నార్త్​ సిటీ వాసుల మెట్రో రైల్‌ కలకు అడుగులు- కొత్త సంవత్సరం కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

metro_service_for_hyderabad_north_zone_state_government_key_decision
metro_service_for_hyderabad_north_zone_state_government_key_decision (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 1, 2025, 5:44 PM IST

Metro Service for Hyderabad North Zone State Government Key Decision : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్​ నగర వాసులకు తీపి కబురు చెప్పింది. హైదరాబాద్‌ ఉత్తర భాగంలో మెట్రో రైల్‌ కల నెరవేరబోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నార్త్‌ సిటీ వాసులకు నూతన సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్యారడైజ్ నుంచి మేడ్చల్‌ (23 కిలోమీటర్లు), జేబీఎస్‌ నుంచి శామీర్‌పేట్‌ (22 కిలోమీటర్లు)కు మెట్రో కారిడార్ల డీపీఆర్‌ల తయారీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

వెంటనే డీపీఆర్‌లను సిద్ధం చేసి మెట్రో రైల్‌ ఫేజ్‌-2 ‘బి’లో భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించాలని హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డిని ఆదేశించారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డితో ఈ రెండు కారిడార్ల డీపీఆర్ తయారీ విషయంపై చర్చించి ఈ మేరకు సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు.

ప్యారడైజ్ నుంచి మేడ్చల్ (23 కి.మీ) : ఈ లైన్లో​ తాడ్‌బన్, సుచిత్ర, కొంపల్లి, కండ్లకోయ మీదుగా మేడ్చల్‌ వరకు మెట్రో సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు.

జేబీఎస్ నుంచి మేడ్చల్ (22 కి.మీ) : కార్ఖానా, తిరుమలగిరి, అల్వాల్, హకీంపేట మీదుగా శామీర్‌పేట వరకు ఈ మెట్రో సేవలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదాల్లో దిల్లీని మించేసిన హైదరాబాద్​ - నగరంలో అక్కడ మరీ డేంజర్!

విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు - తొలిదశ డీపీఆర్‌కు ప్రభుత్వం ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.